Mahadev App | మహాదేవ యాప్ ప్రమోటర్‌ను అదుపులోకి తీసుకున్న దుబాయి పోలీసులు..!
Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్‌ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్‌ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్, సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌ను ప్రస్తుతం అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు. చంద్రకర్‌పై ఈడీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుబాయి ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. అయితే, ఈ విషయాన్ని ఈడీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలోనే ఆయనను భారత్‌కు తరలించే అవకాశం ఉన్నది.
సౌరభ్ చంద్రకర్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. విడుదల చేస్తే పారిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూఏఈ అధికారులు ఆయనపై నిఘా వేసి ఉంచారు. మహాదేవ యాప్‌ను ఆన్లైన్ బెట్టింగ్ కోసం రూపొందించారు. పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్ పేరుతో గేమ్స్ నిర్వహించేవారు. అలాగే క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, ఎన్నికలపై సైతం అక్రమంగా బెట్టింగ్‌లు నిర్వహించారు. అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ ద్వారా యాప్ నెట్వర్క్ వేగంగా వ్యాపించింది. ఛత్తీస్‌గఢ్‌కు గరిష్ఠ ఖాతాలు తెరిచారు. ఈ యాప్‌తో మోసాలకు పాల్పడేందుకు ప్రత్యేకంగా బ్లూప్రింట్‌ను రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

