Maharashtra Assembly | మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు.. శివసేన వర్గాలకు మహా అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Maharashtra Assembly | మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ‘మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్ ప్రశ్నించారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ‘మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్ ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు.
గతంలో శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ థాకరే వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే, షిండే వర్గంలోని 40 మందిలో 16 మంది అనర్హత విచారణ ప్రారంభించినున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పీకర్‌కు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ నర్వేకర్ వెంటనే శివసేన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేశారు. ప్రస్తుతం అసలైన శివసేన తమదంటే తమదేనని రెండు వర్గాల ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఉద్ధవ్ థాకరే వర్గం పిటిషన్‌తో ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడంతో సీఎం షిండే సహా ఆయన వర్గంలో 16 మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారించాలని ఈసీని ఆదేశించింది. ఏక్‌నాత్ షిండే సీఎం పదవిలో కొనసాగవచ్చని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

