కాంగ్రెస్ ఎమ్మెల్యే బంగ్లాలో మహిళ ఆత్మహత్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే | మధ్యప్రదేశ్‌లోని గంధ్వాని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ బంగ్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 38

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని గంధ్వాని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘార్ బంగ్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 38 ఏండ్ల మహిళ తన భర్తతో కలిసి ఎమ్మెల్యే బంగ్లాలో గత సంవత్సర కాలం నుంచి సర్వెంట్లుగా పని చేస్తున్నారు. అయితే ఆ మహిళ ఆదివారం బంగ్లాలోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను గమనించిన భర్త తక్షణమే ఎమ్మెల్యే సింఘార్‌కు సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంతో పాటు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సింఘార్ జీవితంలో తనకు చోటు ఇవ్వలేదని, అందుకు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నది. అయితే గత కొంతకాలం నుంచి ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని, అంబాల, భోపాల్‌లో సైకియాట్రిక్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మహిళ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎమ్మెల్యే సింఘార్ అక్కడ లేరు. గత మూడు రోజులు గంధ్వాని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింఘార్ మాట్లాడుతూ.. ఆ మహిళ చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. తనకు మంచి స్నేహితురాలు అని ఆయన పేర్కొన్నారు. ఆమె సైకియాట్రిక్ వద్ద చికిత్స పొందుతున్నట్లు తనకు అసలు తెలియదు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

