చెన్నై, అక్టోబర్ 27: తమిళనాడు ప్రతిపాదించిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. చెన్నై వచ్చిన రాష్ట్రపతికి ఈ మేరకు విమానాశ్రయంలో స్టాలిన్ లేఖ అందించారు. బిల్లుకు సంబంధించి కేంద్ర హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అడిగిన వివరణలన్నీ అందించామని తెలిపారు.