Lunar Eclipse | రేపే ఆకాశంలో అద్భుతం.. ఒకేరోజు సూపర్‌మూన్, చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
Lunar Eclipse | రేపు రాత్రి వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించనున్నది.
Lunar Eclipse | రేపు రాత్రి వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు. ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఉపగ్రమైన చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది.
భూమినీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తుంటారు. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయం ఏర్పడి.. 10.17 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని నాసా పత్యక్ష ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఈ సారి పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనున్నది. మరో వైపు రేపు చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించనున్నాడు. దీన్నే సూపర్‌మూన్‌గా పిలుస్తుంటారు. ఈ సూపర్మూన్ని హార్వెస్ట్ మూన్‌గా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

