Love, Not Lust | వారిది ప్రేమ సంబంధమే, కామం కాదు.. బాలికపై లైంగిక దాడి నిందితుడికి కోర్టు బెయిల్
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ముంబై: బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. 2020 ఆగస్ట్‌లో మహారాష్ట్రకు చెందిన 13 ఏళ్ల బాలిక డబ్బు, నగలతోసహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. 26 ఏళ్ల ప్రియుడు నితిన్ ధబేరావ్ వద్దకు చేరింది. బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితిన్ వద్ద ఉన్న బాలికను పోలీసులు గుర్తించారు. పోస్కో చట్టం, లైంగిక దాడి, కిడ్నాప్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, నితిన్ తాను ప్రేమించుకున్నట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు హామీ ఇవ్వడంతో ఇంట్లోని డబ్బు, నగలతో తనకు తానే అతడి వద్దకు వెళ్లినట్లు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో నిందితుడు నితిన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
మరోవైపు ఆ బాలిక, వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమే కాని కామం కాదని మహిళా న్యాయమూర్తి ఊర్మిళ జోషి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మైనర్ బాలిక స్వయంగా పోలీసులకు చెప్పిన విషయాన్ని కోర్టు గమనించిందని అన్నారు. ‘లైంగిక దాడిగా ఆరోపించిన కేసులో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ప్రేమ, ఆకర్షణగా కనిపిస్తోంది. నిందితుడు బాధితురాలిని కామంతో లైంగిక వేధింపులకు గురి చేసినట్లు కాదని తెలుస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిందితుడైన నితిన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

