Election Results | ప్రజాతీర్పు ఎవరి వైపు?.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్‌సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్నారు.
- నేడే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా..
- కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాల వెల్లడికీ ఏర్పాట్లు
- పోస్టల్ బ్యాలట్తో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
- మధ్యాహ్నంకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం
- రాష్ట్రంలో 34 కేంద్రాలు.. విధుల్లో 10 వేలమంది
దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్‌సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. వీటితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితమూ నేడు వెల్లడికానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నానికి ఫలితాల ట్రెండ్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ‘ఎగ్జిట్ పోల్స్’ దాదాపు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపగా.. ‘ఎగ్జాక్ట్ పోల్స్’లో ఎలాంటి ఫలితం రానున్నదనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది.
Election Results | న్యూఢిల్లీ, జూన్ 3: రెండు నెలలపాటు సుదీర్ఘంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో తుది ఫలితం మంగళవారం వెలువడనున్నది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలట్ ఓట్లను గణించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టబోయేది తామేనని కమలనాథులు చెబుతుండగా.. ఎగ్జిట్ పోల్స్‌ను విపక్ష ఇండియా కూటమి కొట్టిపారేస్తున్నది. అవి క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని, తమ కూటమి తప్పక అధికారం చేపడుతుందని విపక్ష నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేది నిజమైన సందర్భాలతోపాటు, అబద్ధమైన సందర్భాలు కూడా కండ్ల ముందు ఉన్న నేపథ్యంలో మంగళవారం జరిగే ఓట్ల కౌంటింగ్‌లో ఏ కూటమి విజేతగా నిలువనున్నదో తేలిపోనున్నది.
ఏపీ, ఒడిశా తీర్పూ నేడే
ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు,12 రాష్ర్టాల్లోని 25 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయి. ఏపీలో కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా, మరికొన్ని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో అసలైన ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. ఒడిశాలో బీజేడీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నదని సర్వే సంస్థలు వెల్లడించాయి. మరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలు చీలికకు గురైన నేపథ్యంలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండనున్నదనే దానిపైనా ఉత్కంఠ నెలకొన్నది.
ప్రచారాస్ర్తాలు ఫలితమిచ్చేనా?
లోక్‌సభ ఎన్నికల ప్రచారపర్వం ఉధృతంగా సాగింది. అధికార, విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తించాయి. ఈ సారి ప్రచారం రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు వంటి అంశాల చుట్టూనే ప్రధానంగా సాగింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మైనారిటీల ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులపై విపక్షాలు కన్నేశాయని, వాటిని పంచేస్తారని విస్తృత ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఇండియా కూటమి పక్షాలు కౌంటర్ ప్రచారం చేశాయి. బీజేపీ విభజన, మత రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించాయి.
కాంగ్రెస్‌కు డూ ఆర్ డై!
2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు వరుసగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ.. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి తలెత్తితే, అది పార్టీ ఉనికికే ప్రమాదకరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీని ఓడించేందుకు పలు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల ముందే కూటమి కట్టింది. ఈ ఎన్నికల్లో తమ కూటమి 295 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తదితర నేతలు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

