Lok Sabha Elections | సిట్టింగ్‌లకు షాక్ ఇచ్చిన బీజేపీ.. 37 మంది ఎంపీలకు టికెట్ నో..!
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో 402 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ఐదో విడుతలో 111 స్థానాలకు అభ్యర్థులను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో కేంద్రమంత్రులు, సిట్టింగ్ ఎంపీలకు చోటు దక్కపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో 402 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ఐదో విడుతలో 111 స్థానాలకు అభ్యర్థులను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో కేంద్రమంత్రులు, సిట్టింగ్ ఎంపీలకు చోటు దక్కపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీకే సింగ్‌కు టికెట్లు నిరాకరించింది. అలాగే పార్టీ సీనియర్ నేత వరుణ్ గాంధీ సహా 37 మంది సిట్టింగ్ ఎంపీలను బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రముఖ టీవీ నటుడు అరుణ్ గోవిల్‌కు టికెట్లు కేటాయించింది. జాబితాలో ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు ఇచ్చింది. ఒడిశా సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ పోటీకి దింపింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పూరి లోక్ సభ నుంచి పోటీ చేయనున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
ఇటీవల కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన ఇప్పటి వరకు ఆరు సార్లు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయన రాజ్యాంగం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అగ్రనాయకత్వం ఆయనకు టికెట్‌ను నిరాకరించినట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా తొమ్మిది మందికి బీజేపీ టికెట్ నిరాకరించింది. గుజరాత్లో ఐదుగురు, ఒడిశాలో నలుగురు, బిహార్, కర్ణాటక, జార్ఖండ్‌లో ముగ్గురు చొప్పున మొత్తంగా 37 మంది ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. ఇటీవల బీజేపీలో చేరిన సీతాసోరెన్, తపస్ రాయ్, ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను పోటీలో బరిలోకి దింపింది. కాంగ్రెస్‌కు నేతలు నవీన్ జిందాల్, జితిన్ ప్రసాదకు కురుక్షేత్ర, ఫిలిబిత్ పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. ఇక వయనాడ్ నుంచి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రకు టికెట్ ఇచ్చింది. సందేశ్‌ఖాలీ బాధితుల్లో ఒకరైన రేఖా పాత్ర పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హత్ నియోజకవర్గం టికెట్ కేటాయించింది. కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు బెగుసరాయ్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ నుంచి బరిలో నిలిపింది. కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, నిత్యానంద్ రాయ్ సైతం ప్రస్తుతం కొనసాగుతున్న స్థానాల నుంచే పోటీ చేయనున్నారు.
ఫిలిబిత్ ఎంపీగా కొనసాగుతున్న వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి సుల్తాన్పూర్ నుంచి బరిలో ఉండనున్నారు. ఘజియాబాద్‌లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన కేంద్రమంత్రి వీకే సింగ్‌కు టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో అతుల్ గార్గ్‌కి టికెట్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం టికెట్ కేటాయించింది. ఇక రామాయణం టీవీ సీరియల్లో నటించిన అరుణ్ గోవిల్‌కు మీరట్ టికెట్ ఇచ్చింది. జార్ఖండ్‌లోని దుమ్కా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ణు బీజేపీ పోటీలో నిలిపింది. ఆమె ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ బెల్గాం నుంచి, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బెంగాల్‌లోని తామ్లుక్ నుంచి పోటీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక మేదినీపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ బర్ధమాన్-దుర్గాపూర్ స్థానానికి మార్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

