Lok Sabha Election | మిసా భారతికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..
Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు.
Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ అనంతరం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మానేర్ పోలీస్‌స్టేషన్‌లో మిసా భారతిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో మిసా భారతిని హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రూ.10వేల బాండ్‌పై మిసా భారతికి బెయిల్ మంజూరు చేసింది. ఆమెను కోర్టు నుంచి బయటకు తీసుకెళ్తుండగా జర్నలిస్టులు ఆమెను మాట్లాడాలని కోరగా.. కారులో కూర్చొని వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. రైల్వేలో ఉద్యోగాలకు భూమికేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో మిసా భారతి పేరున్నది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి ఆర్జేడీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పాటలీపుత్ర నుంచి ఆమె ఇప్పటికే రెండుసార్లు పోటీచేసి బీజేపీ అభ్యర్థి రాంకృపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. లాలూ ప్రసాద్ కూడా ఆమెను రెండుసార్లు రాజ్యసభకు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

