CBI | చిన్నారులపై లైంగిక వేధింపులు.. విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులై గ్రామస్థుల దాడి
CBI officials | ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు.

భువనేశ్వర్: ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు (CBI officials) నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామం నుంచి వారిని సురక్షితంగా తీసుకెళ్లిన ఘటన ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలో జరిగింది.

ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలే లక్ష్యంగా సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దేనకనాల్ జిల్లాకు చెందిన మిథున్ నాయక్‌ను అతని ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు.

నిందితుడిని విచారిస్తుండగా అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సీబీఐ బృందంపై దాడికి దిగారు. వారిపై కర్రలతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అక్కడినుంచి పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attack
- CBI officials
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

