న్యూఢిల్లీ : తమ తల్లితండ్రుల పెండ్లి ఫొటోలు, వీడియోలు (Viral Video) చూసేందుకు పిల్లలు ఆసక్తి కనబరుస్తుంటారు. వాటిని చూస్తుండగా చిన్నారుల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూస్తూ ఓ బాలుడి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మానసి అగర్వాల్ ఈ వీడియోను షేర్ చేయగా 20 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ వీడియోలో నవజంట రేస్ 2 మూవీలోని బే ఇంతెహాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం చూడొచ్చు. వైరల్ క్లిప్‌లో చిన్నారి తమ తల్లితండ్రుల సంగీత్ ఫంక్షన్‌లోని దృశ్యాలను చూడటం కనిపిస్తుంది. పదేండ్ల కిందటి వీడియోను వీక్షించిన చిన్నారి మీ ఇద్దరూ ఇప్పటికీ అలాగే ఉన్నారని అంటాడు.
Read More