LinkedIn | ఈ నగరాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ.. నాన్ మెట్రో నగరాల జాబితా విడుదల చేసిన లింక్డ్ఇన్
LinkedIn : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనగానే మెట్రో సిటీలే గుర్తొస్తాయి. కానీ, నాన్ మెట్రో సిటీలలో కూడా ఇటీవలి కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కుతున్నాయి.
LinkedIn : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనగానే మెట్రో సిటీలే గుర్తొస్తాయి. కానీ, నాన్ మెట్రో సిటీలలో కూడా ఇటీవలి కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కుతున్నాయి. ఈ విషయాన్ని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ వెల్లడించింది. ఈ ఏడాదికి సంబంధించి దేశంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టాప్-10 నాన్ మెట్రో నగరాల జాబితాను లింక్డ్ఇన్ తాజాగా విడుదల చేసింది. ఈ నగరాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నట్లు, కార్పొరేట్ పెట్టుబడులు కూడా పెరిగినట్లు సంస్థ తెలిపింది.
సిటీస్ అండ్ ద రైజ్ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టాప్ నాన్ మెట్రో సిటీగా విశాఖపట్నం నిలిచింది. టైర్-1 సిటీలుగా పిలిచే బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి నగరాల తర్వాత విశాఖలోనే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. విశాఖ తర్వాత వరుసగా రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్పూర్, రాజ్కోట్, గ్వాలియర్, ఆగ్రా, జమ్మూ, వారణాసి నిలిచాయి. ఆయా నగరాల్లో నిర్మాణాలు, మౌలిక వసతులు మెరుగవ్వడం, పోటీతో కూడిన నిర్వహణ ఖర్చులు, టెక్, ఫార్మా కంపెనీలు, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలు భారీగా ఉద్యోగాలు కల్పించడం వంటివి టైర్-2 సిటీల ఎదుగుదలకు కారణాలని లింక్డ్ఇన్ నివేదిక చెబుతోంది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యాపార వృద్ధి. ఇంజనీరింగ్, సేల్స్, ఆపరేషనల్ రోల్స్ వంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. తీర ప్రాంతాలైన విశాఖపట్నంతోపాటు విజయవాడ, వారణాసి, నాసిక్ వంటి పట్టణాల్లో కూడా వేగంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. భారతీయ నిపుణులు కూడా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సొంత ప్రాంతాన్ని విడిచి, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికంటే స్థానికంగా ఉండి పని చేసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారని నివేదిక చెబుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

