న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజ సంస్థ ‘ఎల్ఐసీ’ ఫిన్టెక్ రంగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నది. వ్యూహాత్మక పెట్టుబడితో గానీ, అంతర్గత వనరులతోగానీ ఒక ప్రత్యేక ఫిన్టెక్ విభాగాన్ని ఏర్పాటుచేయాలనే అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి వెల్లడించారు. పెరుగుతున్న తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవటంలోనూ, తమ కార్యకలాపాలను ఆధునీకరించటంలోనూ ఎల్ఐసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు.
నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు ఫిన్టెక్, ఇన్సూర్టెక్ రంగాలకు చెందిన సంస్థలతో ఎల్ఐసీ కలిసి పనిచేస్తున్నదని దొరైస్వామి తెలిపారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.