మెల్బోర్న్, సెప్టెంబర్ 7: కారు నడపాలంటే పెట్రోల్, డీజిల్ కావాలి. ఎలక్ట్రిక్ వాహనాలైతే విద్యుత్తు అవసరం. కానీ గాలితో కూడా కార్లు నడుపొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారుచేసే నూతన సాంకేతికతను అభివృద్ధిపరిచారు. సాధారణంగా విద్యు త్తు, నీరు ఉపయోగించి ఎలక్ట్రోలైజర్లు గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. ప్రస్తుత పరికరాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ప్రొటోటైప్ ఎలక్ట్రోలైజర్లు తేమ ఉన్న గాలి నుంచి నీటిని పీల్చుకుని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా వేరు చేస్తాయి. ఈ హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగపడుతుందన్న మాట. మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తతలు ఈ ఆవిష్కరణ చేశారు.