స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి : సుప్రీంకోర్టు
Supreme Court |
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది.
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీలో పటాకుల వినియోగం, విక్రయాలపై కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉందంటూ విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో బాణాసంచా విక్రేతలు అత్యవసరంగా విచారణ జరుపాలని కోరారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలో పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పటాకులు విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. అలాగే పటాకులు కొనుగోలు చేస్తే రూ.200 జరిమానాతో పాటు ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుండడంతో ప్రభుత్వం పటాకులపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

