వాటర్ టిన్‌లో ఇరుక్కున చిరుత తల… రక్షించిన అటవీ శాఖ
ముంబై: ప్లాస్టిక్ వాటర్ టిన్‌లో చిరుత పులి పిల్ల తల ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు దానిని తొలగించి ఆ చిరుత పిల్లను రక్షించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో పార్టీ జరుపుకున్న కొందరు టూరిస్టులు వాటర్ క్యాన్ కింది భాగాన్ని అక్కడే వదిలి పోయారు. అయితే దాహంతో ఒక చిరుత పులి పిల్ల నీటిని తాగేందుకు ప్రయత్నించగా దాని తల ఆ టిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అది రెండు రోజుల పాటు తిండి తినలేక, నీరు తాగలేక, గాలి సరిగా పీల్చలేక చాలా ఇబ్బంది పడింది.
కాగా, వాటర్ టిన్‌లో తల ఇరుక్కున్న చిరుత పిల్లను తొలుత ఆదివారం రాత్రి బద్లాపూర్ గ్రామం సమీపంలో కారులో వెళ్తున్న ఒక వ్యక్తి గమనించాడు. దీనిని తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసి అటవీ శాఖకు ట్యాగ్ చేశాడు. అయితే అటవీ శాఖ సిబ్బంది అక్కడకు వచ్చేంతలోపు ఆ చిరుత పిల్ల అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ సభ్యులు, కొందరు గ్రామస్తులతో కలిపి సుమారు 70 మంది బృందాలుగా ఏర్పడి ఆ చిరుత కోసం వెతికారు.
మంగళవారం రాత్రి బద్లాపూర్ గ్రామం సమీపంలోనే ఇది మరోసారి కనిపించింది. దీంతో దానికి మత్తు మందు ఇచ్చి తల ఇరుక్కున్న వాటర్ టిన్ను తొలగించారు. సుమారు రెండు రోజులుగా ఆహారం, నీరు లేక, సరిగా ఊపిరి ఆడక ఇబ్బంది పడిన ఆ చిరుత పిల్లను రెండు రోజులపాటు పరిశీలనలో ఉంచుతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెడతామని వెల్లడించారు.
Irresponsible behaviour of tourist and people venturing into forest to party is posing a grave threat to the wild animals. A Leopard with its head stuck inside a plastic jar was spotted near Badlapur in Thane district. @MahaForest has begun the search operation. @AUThackeray pic.twitter.com/2O0CIYcSYT
— Ranjeet Shamal Bajirao Jadhav (@ranjeetnature) February 15, 2022
#update The leopard was spotted and safely rescued. The plastic container/vessel has been removed and the animal has been taken to #SGNP @MahaForest pic.twitter.com/TC1Xpm6Sdb
— Ranjeet Shamal Bajirao Jadhav (@ranjeetnature) February 15, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

