డెల్టాను కోవీషీల్డ్ సమర్ధవంతంగా అడ్డుకున్నది: లాన్సెట్ నివేదిక

న్యూఢిల్లీ: ఇండియాలో డెల్టా వేరియంట్ ప్రబలుతున్న సమయంలో.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేసినట్లు ద లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను ప్రచురించింది. మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయి కోవిడ్ లక్షణాలు ఉన్న వారి పట్ల కోవీషీల్డ్ మెరుగ్గా పనిచేసినట్లు ఆ స్టడీలో తేల్చారు. సార్స్ సీవోవీ2కు చెందిన డెల్టా వేరియంట్ ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఇండియాలో పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కోవీషీల్డ్ టీకా ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేశారు. రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సమర్ధత 63 శాతం ఉన్నట్లు ద లాన్సెట్ తన స్టడీలో తెలిపింది. ఇక మధ్యస్థాయి నుంచి తీవ్ర స్థాయి వ్యాధి ఉన్నప్పుడు వ్యాక్సిన్ సమర్ధత 81 శాతంగా ఉన్నట్లు లాన్సెట్ తన రిపోర్ట్‌లో తెలిపింది. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

