ఏఐ, అణు యుద్ధంతో 2100 నాటికి మానవాళి అంతం!
అణు యుద్ధం, కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం వల్ల మానవాళి మనుగడ భవిష్యత్తులో ప్రమాదంలో పడొచ్చని లాన్సెట్ కొత్త నివేదిక హెచ్చరించింది. ఈ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ 2100 నాటికి వాటి వల్ల మానవాళి తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. మనుషుల ఆరోగ్యానికి రానున్న 75 ఏండ్లలో ప్రమాదకరంగా మారే 17 అంశాలను నివేదిక పేర్కొంది.
- లాన్సెట్ నివేదిక హెచ్చరిక
న్యూఢిల్లీ: అణు యుద్ధం, కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం వల్ల మానవాళి మనుగడ భవిష్యత్తులో ప్రమాదంలో పడొచ్చని లాన్సెట్ కొత్త నివేదిక హెచ్చరించింది. ఈ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ 2100 నాటికి వాటి వల్ల మానవాళి తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. మనుషుల ఆరోగ్యానికి రానున్న 75 ఏండ్లలో ప్రమాదకరంగా మారే 17 అంశాలను నివేదిక పేర్కొంది. వాటిలో ప్రధానంగా అణు యుద్ధం, ఏఐ దుర్వినియోగం, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, పిల్లల్లో పోషకాహార లోపం, ఊబకాయం, అంతర్జాతీయ సహాయంలో కోత వంటివి ఉన్నాయి.
‘ఆరోగ్యానికి 21వ శతాబ్దపు ప్రపంచ ప్రమాదాలపై లాన్సెట్ కమిషన్’ పేరిట విడుదలైన నివేదికలో ఈ సమస్యలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని..ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు ఇప్పటికీ చర్యలు తీసుకొని భవిష్యత్తు తరాలను రక్షించవచ్చని నిపుణులు తెలిపారు. జీవాయుధాల సృష్టికి ఏఐని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదని.. ఈ ఆయుధాలు లక్షలాది మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తాయని వారు హెచ్చరించారు.
అణు యుద్ధం వల్ల పెద్ద సంఖ్యలో రేణువులు ఉపరితల వాతావరణంలోకి చేరతాయని..అవి సూర్య కాంతిని అడ్డుకొని ఆహారోత్పత్తిని ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఇది కరువుకు దారి తీసి మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఆల్కహాల్ సేవనం, అధిక రక్తపోటు, ఆదాయ అసమానతలు, తక్కువ విద్యా స్థాయిలు, మానసిక ఆరోగ్య క్షీణత, కూడా మానవాళి ఆరోగ్యానికి సవాళ్లు విసురుతాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

