Lalu Prasad Yadav | 76 కిలోల లడ్డూతో.. 76వ పుట్టిన రోజు జరుపుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
పాట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. బీహార్ మాజీ సీఎం, భార్య రబ్రీ దేవి అధికార నివాసానికి పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్రసాద్‌కు స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు మిఠాయిలను బహూకరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఫోన్లో లాలూతో మాట్లాడి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

..
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయానికి మార్గదర్శకుడు, వ్యక్తిత్వంలో సంపన్నుడు, బలమైన వ్యక్తిత్వం, బీహార్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన గౌరవనీయులైన లాలూజీకి హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే జరుపుకున్న ఫొటోలను అందులో పోస్ట్ చేశారు.
देश-विदेश में बिहार का नाम रोशन करने वाले, मजबूत शख्सियत एवं दृढ़ व्यक्तित्व के धनी, सामाजिक न्याय के प्रणेता आदरणीय @laluprasadrjd जी को अवतरण दिवस की हार्दिक शुभकामनाएं एवं बधाई।#सामाजिक_न्याय_के_महानायक_लालू pic.twitter.com/ZbnMHZi2uY
— Tejashwi Yadav (@yadavtejashwi) June 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

