Lalit Modi’s Birthday | ఖరీదైన క్లబ్లో లలిత్ మోదీ బర్త్‌డే పార్టీ.. ఎంజాయ్ చేసిన విజయ్ మాల్యా
Lalit Modi’s Birthday | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ (Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) లండన్ (Landon) లో తన 63వ బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. గత వారాంతంలో జరిగిన ఈ పార్టీకి ఆయన సన్నిహితులతోపాటు, పరారీలో ఉన్న మరో భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya) కూడా హాజరయ్యారు.
Lalit Modi’s Birthday : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ (Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) లండన్ (Landon) లో తన 63వ బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. గత వారాంతంలో జరిగిన ఈ పార్టీకి ఆయన సన్నిహితులతోపాటు, పరారీలో ఉన్న మరో భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya) కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
లండన్‌లోని మేఫెయిర్‌లో ఉన్న ఖరీదైన మ్యాడాక్స్ క్లబ్లో పార్టీ జరిగింది. ఈ క్లబ్లో ఒక టేబుల్ కోసం కనీసం వెయ్యి పౌండ్లు (అంటే సుమారు రూ.1.18 లక్షలు) ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. పార్టీలో స్నేహితుల మధ్య కేక్ కట్ చేయడం, డ్యాన్స్ చేయడం వంటి దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయి. తన భాగస్వామి రీమా బౌరీకి ధన్యవాదాలు తెలుపుతూ.. ‘ఈ పుట్టినరోజు కుటుంబం, స్నేహితులతో ఎంతో అనందంగా గడిచింది. నా జీవిత భాగస్వామి రీమా.. నువ్వు అద్భుతమైన పార్టీ ఇచ్చావు’ అని లలిత్ మోదీ పోస్ట్ చేశారు.
భారత్‌లో తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ, విజయ్ మాల్యా పారిపోయి చాలాకాలంగా యూకేలోనే ఉంటున్నారు. గత జులైలో కూడా వీరిద్దరూ లండన్‌లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో కలిసి పాటలు పాడుతూ కనిపించారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాను భారత్ ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

