ఆర్బీఐ అనూహ్య నిర్ణయం.. ఇక కిరాణాల్లోనూ కేవైసీ అప్డేట్
: బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీని (నో యువర్ కస్టమర్) అప్డేట్ చేసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనూహ్య చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, జూన్ 13: బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీని (నో యువర్ కస్టమర్) అప్డేట్ చేసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనూహ్య చర్యలు చేపట్టింది. కేవైసీని అప్డేట్ చేసుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆర్బీఐ వినూత్న నిర్ణయం తీసుకుంది. కేవైసీ అప్డేట్కు సంబంధించిన రెండు ప్రక్రియలలో ముఖ్యమైన మార్పులను తీసుకువస్తూ ఈనెల 12న(గురువారం) ఆర్బీఐ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటగా, మీ ఇంటి సమీపంలోని కిరాణా దుకాణదారులు లేదా ఎన్జీఓ, స్వయం సహాయక గ్రూపులు(ఎస్‌హెచ్‌జీ), సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐ) వంటి బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పిలిచే బ్యాంకు ఏజెంట్ల వద్దనే ఇక కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.
రెండవది, కేవైసీ అప్డేట్ గురించి బ్యాంకులు ఇకపైన కస్టమర్లకు కనీసం మూడుసార్లు సమాచారం అందచేయాల్సి ఉంటుంది. కాగా, ఒకసారి మాత్రం తప్పనిసరిగా లేఖ రూపంలో సమాచారం పంపడం తప్పనిసరి. కేవైసీని అప్డేట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారికి ఈ మార్పు గొప్ప ఉపశమనం. ఇలా ఉండగా, ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ), ఎలక్ట్రానిక్ నగదు బదిలీ(ఈబీటీ), స్కాలర్షిప్పులు, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాల కోసం బ్యాంకు ఖాతాలు తెరచిన ఖాతాదారులు పెద్ద సంఖ్య లో కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడంతో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

