తొలిసారి పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా మండపం… పోలీస్ డాగ్స్ ప్రారంభం
కోల్‌కతా పోలీస్ డాగ్ స్క్వాడ్‌కు చెందిన జాతి శునకాలు ఈ మండపానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చాయి. తొలిసారి ఏర్పాటు చేసిన పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్‌ను అవి ప్రారంభించాయి.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చాలా అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా, సృజనాత్మకంగా దుర్గా పూజా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసారి పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్‌ను నెలకొల్పారు. దుర్గా మాతా కాళ్ల చెంతన రెండు కుక్కలతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోల్‌కతా పోలీస్ డాగ్ స్క్వాడ్‌కు చెందిన జాతి శునకాలు ఈ మండపానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చాయి. తొలిసారి ఏర్పాటు చేసిన పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్‌ను అవి ప్రారంభించాయి.
కాగా, కోల్‌కతా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారి వినూత్నంగా ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల స్నేహ పూర్వక దుర్గా పూజా మండపానికి తమ డాగ్ స్క్వాడ్ ముఖ్య అతిథిగా వచ్చినట్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్‌లోని నలుగురు సభ్యులైన లాబ్రడార్స్ మోలీ, కాంఫర్, జర్మన్ షెపర్డ్స్ లిజా, డింకీలు దీనిని ప్రారంభించాయని తెలిపారు. బిధాన్ సరనీ అట్లాస్ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ పండల్లో తమ డాగ్స్ చాలా ప్రత్యేకంగా కనిపించాయని పేర్కొన్నారు. దుర్గా పూజలో తమ డాగ్ స్క్వాడ్ పాల్గొనడం ఇదే తొలిసారని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.
మరోవైపు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా మండపం ఏర్పాటును స్వాగతించారు. అలాగే ఆ పండల్‌ను పోలీస్ డాగ్స్ ప్రారంభించడంపై మరింత సంతోషం వ్యక్తం చేశారు. కోల్‌కతా పోలీసులను కొందరు ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

