న్యూఢిల్లీ : మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia), సూపర్‌స్టార్ రజనీకాంత్ జంటగా తెరకెక్కిన జైలర్ మూవీలోని కావాలయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్‌కు తమన్నా హాట్ మూమెంట్స్ ఎందరినో ఉర్రూతలూగించాయి. ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో ఎంతోమంది రీక్రియేట్ చేశారు. ఇక లేటెస్ట్గా కిలీ పాల్, ఆయన సోదరి నీమా పాల్ ఈ హిట్ నెంబర్‌కు క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా 40 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వైరల్ వీడియోలో సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అన్నాచెల్లెళ్లు నెటిజన్లను ఆకట్టుకున్నారు. జైలర్ సాంగ్ కావాలయ్యాకు తమన్నా హాట్ డ్యాన్స్ ఇంటర్నెట్ను మెస్మరైజ్ చేసింది. తమన్నా వేసిన హుక్ స్టెప్ నెక్ట్స్లెవెల్ అంటూ నెటిజన్లు రీల్స్‌తో సందడి చేశారు.
Read More :