న్యూఢిల్లీ : కిలి పౌల్ అతడి సోదరి నీమా పౌల్ న్యూ డ్యాన్స్ వీడియోతో (Viral Video) నెటిజన్ల ముందుకొచ్చారు. తమ లేటెస్ట్ వీడియోను వారు బిహార్‌లోని ఫ్యాన్స్‌కు డెడికేట్ చేశారు. ఈ వీడియోలో అన్నా చెల్లెళ్లు భోజ్‌పురి సాంగ్ నథూనియాకు క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు.
బిహార్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్..మీరు చూపిస్తున్న ప్రేమతో రాబోయే రోజుల్లో మరింత కంటెంట్‌తో అలరిస్తాం..మా భారతీయ కుటుంబాన్ని నేనేంతో ప్రేమిస్తా..జై హింద్. లవ్ యూ ఆల్..ఐక్యతే శక్తివంతమైనదంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో వారి ఎనర్జిటిక్ మూమెంట్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరి పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో హార్ట్, లవ్ ఎమోజీలతో ప్రశంసలు గుప్పించారు.
Read More :