10.30కు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఖర్గే
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 24 ఏళ్ల తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా నిలువనున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రమాణ స్వీకర కార్యక్రమం కోసం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటు సీడబ్ల్యుసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, సీఎల్పీ నాయకులు, మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులు హాజరవుతారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ నెల 17 ఎన్నికలు నిర్వహించారు. సీనియర్ నేతలైన మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్‌పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు. ఆయనుకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కు 1072 ఓట్లు పోలయ్యాయి. మరో 416 ఓట్లను తిరస్కరించారు. గాంధీ కుటుంబం ఖర్గేకు మద్దతుగా నిలవడంతో ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు.

కాగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే.. బుధవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడినుంచి ఏఐసీసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

