పతనంతిట్ట (కేరళ): రెండు నెలలపాటు కొనసాగనున్న కేరళలోని శబరిమల దర్శన యాత్రకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిరోజు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16 నుంచి మండల యాత్ర ప్రారంభం అవుతుంది. దర్శనానికి వచ్చే భక్తులు.. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సరిఫ్టికెట్ను తప్పనిసరిగా చూపించాలి. ఒరిజినల్ ఆధార్‌కార్డు వెంట ఉండాలి. కరోనా నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. బుకింగ్ లేకుండా వచ్చేవాళ్లు నిలక్కల్ దగ్గర బుకింగ్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు.