శృంగారం కోసం బయిటికెళ్తా.. ఈ-పాస్ ఇవ్వండి

కన్నూరు: కరోనా వేళ చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎవరైనా బయటకు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్రమైన అభ్యర్థన చేశాడు. శృంగార కోసం బయటకు వెళ్లాలనుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్యక్తి పోలీసుల్ని కోరాడు. కన్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అప్లికేషన్ పెట్టిన ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వాలాపట్టణం పోలీసులు అతన్ని వెతికి పట్టుకున్నారు. అయితే అక్షర దోషం వల్ల తన అప్లికేషన్లో పొరపాటు జరిగినట్లు సదరు వ్యక్తి పోలీసులకు క్షమాపణ చెప్పాడు. ఇంగ్లీషులో ‘six o clock’ అని రాయాలని అనుకున్నానని, కానీ తన దరఖాస్తులో పొరపాటున ‘sex’ అని పడినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి క్షమాపణలను స్వీకరించిన పోలీసులు.. అనవసర కారణాలతో ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవద్దు అంటూ అతన్ని రిలీజ్ చేశారు. బీహార్‌లోనూ ఓ వ్యక్తి కూడా చిత్రమైన కారణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాలని కోరాడు. మొటిమల చికిత్స కోసం వెళ్లేందుకు తనకు పాస్ ఇవ్వాలని అతను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

