Wayanad | వయనాడ్ విపత్తుపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం
Wayanad | కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad)లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Wayanad | కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad)లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది. మిస్ అయిన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ కమిటీ విపత్తులో తప్పిపోయిన వారి జాబితాను తయారు చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి (District Disaster Management Authority) సమర్పిస్తుంది. డీడీఎమ్ఏ ఆ జాబితాను పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపితే.. అక్కడి నుంచి ఆ జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారిని ప్రభుత్వం మృతులుగా ప్రకటించి.. వారి బంధువులకు పరిహారం అందిస్తుంది.
కాగా, గతేడాది జులై 30న వయనాడ్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మరో 35 మంది మిస్సయ్యారు.
Also Read..
Car Parking | కారు కొనాలంటే పార్కింగ్ స్థలం చూపించాల్సిందే.. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

