కరోనా రోగుల్లో ఉత్తేజం నింపేందుకు భార్యతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులు!

బెంగళూర్ : కరోనా మహమ్మారి సోకగానే బెంబేలెత్తే రోగుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు కర్నాటకలోని హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులతో తన భార్యతో కలిసి ఆయన ఆడిపాడారు. కన్నడ సినిమాల్లో హిట్ సాంగ్స్ కు అనుగుణంగా దావణగెరేలో ఆయన రోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. కొవిడ్ రోగులతో ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.
కొవిడ్-19 రోగులు కుంగుబాటుకు గురవకుండా గతంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది డ్యాన్స్ లు చేసిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇక కర్నాటకలో గడిచిన 24 గంటల్లో 22,758 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ఒక్కరోజే 38,224 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కర్నాటకలో ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- karnataka
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

