బెల్గావి: కర్నాటక మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్పై .. బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటక సువర్ణ విధాన సౌధలో(Legislative Council) గందరగోళం ఏర్పడింది. మంత్రి హెబ్బాల్కర్ మద్దతుదారులు .. శాసనమండలిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. సీటీ రవిపై అటాక్ చేసేందుకు యత్నించారు. మంత్రి మద్దతుదారుల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నది. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్ మండలి చైర్మెన్‌ను కోరారు. ఆ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మండలి చైర్మెన్ బసవరాజ్ హోరట్టి సభను వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. మంత్రి హెబ్బాల్కర్, సీటీ రవి మధ్య మాటల యుద్ధం సాగింది. రవి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మంత్రి ఆరోపించారు. చైర్మెన్ వద్ద ఆమె తన ఫిర్యాదు నమోదు చేశారు. అయితే ఆ ఆరోపణలను సీటీ రవి ఖండించారు. ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీటీ రవి క్రిమినల్ చర్యకు పాల్పడినట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
Supporters of Minister @laxmi_hebbalkar stormed Vidhan Soudha after BJP MLC @CTRavi_BJP allegedly abused her during the council session. CM @siddaramaiah called the act a “criminal offence.” The minister is set to file a police complaint. #Karnataka pic.twitter.com/oHzhNSdkYJ
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) December 19, 2024