Girl Sold for Loan Settelement | రూ.35,000 అప్పు తీర్చడానికి.. బాలికను అమ్మిన పెద్దమ్మ
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసులను ఆశ్రయించింది. దీంతో కొన్న వ్యక్తి నుంచి ఆ బాలికను కాపాడారు.
బెంగళూరు: వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. (Girl Sold for Loan Settelement) ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసులను ఆశ్రయించింది. దీంతో కొన్న వ్యక్తి నుంచి ఆ బాలికను కాపాడారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన 11 ఏళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో ఉన్న పెద్దమ్మ సుజాత ఇంటికి వెళ్లింది. కూతురు వరుసైన ఆ బాలికను బాగా చూసుకుంటానని సోదరి చౌడమ్మకు ఆమె చెప్పింది.
కాగా, భూస్వామి శ్రీరాములు నుంచి సుజాత రూ.35,000 అప్పు తీసుకుంది. దీనిని తీర్చేందుకు కూతురు వరుసైన ఆ బాలికను అతడికి అమ్మేసింది. బాలికను నిర్బంధించిన శ్రీరాముడు బాతులను మేపే పనులు చేయిస్తున్నాడు.
మరోవైపు బాలిక తల్లి చౌడమ్మ జూన్‌లో తన సోదరి సుజాత ఇంటికి వెళ్లింది. తన కుమార్తె శ్రీరాములు వద్ద పనులు చేయడం చూసి ఆమె షాక్ అయ్యింది. తన కూతురును విడిచిపెట్టాలని అతడ్ని ప్రాథేయపడింది. అయితే తన అప్పు చెల్లిస్తేనే బాలికను విడిచిపెడతానని అతడు చెప్పాడు.
అయితే చౌడమ్మ ఏమీ చేయలేక తుమకూరుకు వెళ్లిపోయింది. జూలై 3న జిల్లా కార్మిక అధికారిణి తేజావతిని ఆమె కలిసింది. అప్పు తీర్చేందుకు తన కుమార్తెను భూస్వామి శ్రీరాములకు సోదరి సుజాత, ఆమె భర్త అమ్మేశారని ఫిర్యాదు చేసింది. స్పందించిన ఆ అధికారిణి తుమకూరు ఎస్సైకి లేఖ రాసింది.
మరోవైపు బాలికను కాపాడాలని తుమకూరు పోలీసులను ఎస్సై ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ పోలీసులు హిందూపురం చేరుకున్నారు. శ్రీరాములు ఇంటి నుంచి ఆ బాలికను కాపాడారు. తుమకూరుకు తరలించి ఆమె తల్లికి అప్పగించారు. శ్రీరాములు, సుజాత, ఆమె భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

