Bigg Boss | కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నెట్టింట విమర్శల వెల్లువ
Bigg Boss | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss )కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడనాట బిగ్‌బాస్ (Bigg Boss Kannada) 10 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లోకి షాకింగ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss )కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఈ షో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ్లో బిగ్‌బాస్ 7 సీజన్ నడుస్తోంది. కాగా, కన్నడనాట బిగ్‌బాస్ (Bigg Boss Kannada) 10 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లోకి షాకింగ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు.
ఎవ్వరూ ఊహించని విధంగా కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోకి ఓ రాజకీయ నాయకుడు పోటీదారుగా ప్రవేశించాడు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే (Karnataka Congress MLA) ప్రదీప్ ఈశ్వర్ ( Pradeep Eshwar) కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. డప్పుచప్పుళ్ల మధ్య అతడు ఘనంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎమ్మెల్యేను చూసిన ఇతర పోటీదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అతడి ఎంట్రీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ಕಲರ್ಫುಲ್ ಮನೆಗೆ ತಾಳ್ಮೆಯ ಬಿಳುಪು; ಎಂಟ್ರೀ ಕೊಟ್ರು ಎಮ್.ಎಲ್.ಎ ಪ್ರದೀಪು!
ಬಿಗ್ ಬಾಸ್ | ಪ್ರತಿ ರಾತ್ರಿ 9:30 #BBK10 #HappyBiggBoss #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ pic.twitter.com/9FB9d1eVrd
— Colors Kannada (@ColorsKannada) October 9, 2023
ఓ ఎమ్మెల్యే.. బిగ్‌బాస్‌లాంటి రియాలిటీషోకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనపై పెద్ద చర్చ నడుస్తోంది. నెటిజన్లు సైతం ఎమ్మెల్యే ఎంట్రీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి.. ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అతడు బిగ్‌బాస్‌లో ఉంటే నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నారు. అయితే, అనాథల సంక్షేమం కోసమే ఎమ్మెల్యే ప్రదీప్ ఇలా బిగ్‌బాస్‌కు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read..
Israel-Hamas War | రాత్రికి రాత్రే గాజాలో 200 మిలిటెంట్ స్థావరాలపై దాడిచేసిన ఇజ్రాయెల్ సైన్యం
Israel-Hamas War | హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో
Fresh Snowfall | కశ్మీర్లో భారీగా హిమపాతం.. సోనామార్గ్ రహదారి మూసివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

