Karnataka | కర్ణాటక కాంగ్రెస్‌లో కులగణన చిచ్చు.. సీఎం సామాజికవర్గానికి ప్రాధాన్యం!
కర్ణాటక కాంగ్రెస్‌లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలోని లింగాయత్, వొక్కలిగ నేతలు ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నారు.
- నివేదికను వ్యతిరేకిస్తున్న లింగాయత్‌లు, వొక్కలిగ నేతలు
Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 16 : కర్ణాటక కాంగ్రెస్‌లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలోని లింగాయత్, వొక్కలిగ నేతలు ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో 17న మంత్రివర్గం సమావేశమై కులగణన నివేదికపై చర్చించనుంది.
లింగాయత్, వొక్కలిగ నేతల్లో ఆందోళన
కుల గణనకు సంబంధించిన నివేదికను ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచారు. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుత అంచనా కన్నా 38 శాతం అధికంగా రాష్ట్రంలో ఓబీసీల సంఖ్య 69.6 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వొక్కలిగలు, లింగాయత్‌లు 3ఏ, 3బీ క్యాటగిరీల కింద ఓబీసీ రిజర్వేషన్లు 12.2 శాతం, 13.6 శాతం అనుభవిస్తున్నారు. జనాభా పరంగా వీరి సంఖ్య 17 శాతం, 15 శాతం ఉండవచ్చునని అంచనా కాగా, అంతకన్నా తక్కువగా వీరి సంఖ్య నమోదైంది. అయితే ప్రస్తుత కుల సర్వే 4 శాతం పాయింట్లను పెంచుతూ వీరిని 2బీ క్యాటగిరీ కింద ఉంచాలని సిఫార్సు చేసింది. దీంతో వొక్కలిగ, లింగాయత్‌లకు రిజర్వేషన్లలో మూడు శాతం పెరిగి స్వల్ప ప్రయోజనం ఏర్పడనుంది. అయితే ఓబీసీ వర్గాల కోటా పెంచుతూ నివేదిక సిఫార్సు చేయడం.. ఇంతకాలం రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం వహిస్తూ వచ్చిన వొక్కలిగ, లింగాయత్ వర్గాల్లో ఆందోళనకు దారి తీసింది. ఊహించిన దాని కన్నా అత్యధికంగా ఉన్న ఓబీసీలకు కోటా పెంపు వల్ల జనాభా ప్రాతిపదికన మిగిలిన వర్గాలకు సీట్ల కేటాయింపు పెరుగుతుందని, తద్వారా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల టికెట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆ వర్గం నేతలు ఆందోళన చెందుతున్నారు.
వొక్కలిగ నేతలతో డీకే భేటీ
తాజా పరిణామాలతో కాంగ్రెస్‌లో వొక్కలిగల ఆధిపత్యం ఏమాత్రం తగ్గకూడదని ఆ వర్గానికే చెందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆ వర్గ ఎమ్మెల్యేలు, నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. కాగా, కుల సర్వే అంతా ఫార్సుగా బీజేపీ కొట్టిపారేసింది. ఇది మైనారిటీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ చేసిన సర్వే అని, అందులోని అంకెలన్నీ సీఎం సిద్ధరామయ్య చెప్పినవేనని బీజేపీ నేత ఆర్ అశోక ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

