Karnataka bandh | ఈ నెల 22న కర్ణాటక బంద్.. ఎందుకో తెలుసా..?
Karnataka bandh | మహారాష్ట్ర (Maharashtra) లో కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడం, బెళగావి (Belagavi) లో మరాఠీ (Marati) మాట్లాడలేదని కండక్టర్‌పై దాడి ఘటనలను ఖండిస్తూ మార్చి 22న కన్నడ సంఘాలు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చాయి.
Karnataka bandh : మహారాష్ట్ర (Maharashtra) లో కేఎస్ఆర్టీసీ (KSRTC) సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడం, బెళగావి (Belagavi) లో మరాఠీ (Marati) మాట్లాడలేదని కండక్టర్‌పై దాడి ఘటనలను ఖండిస్తూ మార్చి 22న కన్నడ సంఘాలు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చాయి. కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్.. శుక్రవారం కన్నడ సంఘాల ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం వాటాళ్ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలోనే కన్నడిగులను వేధించడం, మహారాష్ట్రకు వెళ్లే బస్సులు, సిబ్బందిపై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. మార్చి 7న బెళగావి ఛలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 11న అత్తిబెలె సరిహద్దును బంద్ చేస్తామని, 16న హొస్కోటె టోల్ బంద్ చేస్తామని తెలిపారు. 22న కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చామని అన్నారు.
బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తీర్మానించామని ఆయన చెప్పారు. టౌన్‌హాల్ నుంచి ఫ్రీడం పార్కు దాకా ర్యాలీ కొనసాగుతుందన్నారు. బంద్‌కు అన్ని ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల మద్దతు కోరామని, అందరూ మద్దతు తెలిపారని చెప్పారు. ముఖ్య నాయకులు ప్రవీణ్‌శెట్టి, గోవిందు, కేసీ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అయితే కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ.. రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు తెలుపడం లేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

