కపిల్ సిబల్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి..
రాయ్‌పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్‌ను బహిష్కరించాలని ఛత్తీస్‌గఢ్ మంత్రి టీఎస్ సింగ్‌దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా తన వ్యక్తిగత, అసహ్యకరమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత కపిల్ సిబల్ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పక్కన పెట్టి.. పార్టీని నడిపించే మరో నాయకుడికి అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానంతో పాటు సీనియర్ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. జీ-23కి చెందిన నేతలు 2020లో సోనియాగాంధీకి పార్టీ పునర్జీవానికి, శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ జీ-23 గ్రూప్‌లో కపిల్ సిబల్ సైతం ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

