Kailash Mansarovar Yatra | కైలాస్ మానస సరోవర్ యాత్ర.. కీలక అప్డేట్ ఇచ్చిన విదేశాంగ మంత్రిత్వశాఖ..!
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వెళ్తాయని పేర్కొంది.
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వెళ్తాయని పేర్కొంది. మరో 50 మంది పర్యాటకుల పది బ్యాచులు సిక్కీం నుంచి నాథు లా పాస్ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేందుకు kmy.gov.in వెబ్సైట్ని ప్రారంభించింది. దరఖాస్తులను కంప్యూటర్ జనరేటెడ్, ర్యాండమైజ్, జండర్ బేస్డ్ విధానంలో ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించనున్నారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి కైలాస మానస సరోవర యాత్ర నిర్వహించని విషయం తెలిసిందే. ఈ సారి నిర్వహించనున్న యాత్రపై ద్రవ్యోల్బణం ప్రభావం పడే అవకాశం ఉన్నది. కైలాస మానస సరోవర్ యాత్ర కోసం పర్యాటకులు కుమావున్ మండల్ వికాస్ నిగమ్ (KMVN)కి రూ.35వేలకు బదులుగా రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రయాణం, వసతి, ఆహారం తదితరాల కోసం వికాస్ నిగమ్ వెచ్చిస్తుంది. దాంతో పాటు వైద్య పరీక్షలు, చైనా వీసా, పోర్టర్, టిబెట్ అటానమస్ రీజియన్, చైనా బోర్డర్ ఫీజులను ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. కుమావున్ మండల్ వికాస్ నిగమ్ లిపులేఖ్ పాస్ ద్వారా కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం ఏర్పాట్లు చేస్తుంది.
ఈ సారి రిజిస్ట్రేషన్తో పాటు, యాత్రికులు ఆహారం, ప్రయాణం, వసతి కోసం కేఎంవీఎన్ కోసం రూ.56వేలు చెల్లించాలి. కుమావున్ మండల్ వికాస్ నిగమ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రను నిర్వహిస్తుంది. ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభమై ఫితోర్గఢ్లోని లిపులేఖ్ పాస్ ద్వారా యాత్ర సాగుతుంది. యాత్ర తొలి బృందం జూలై 10న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది. చివరి బృందం ఆగస్టు 22న చైనా నుంచి భారత్కు బయలుదేరుతుంది. ప్రతి బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి తనక్పూర్, ధార్చులా ఒక రోజు చొప్పున.. గుం, జినభిదాంగ్లో రెండురాత్రులు బస చేసిన తర్వాత చైనాలోకి ప్రవేశిస్తుంది. కైలాస దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ బృందం చైనా నుంచి బయలుదేరి బుండి, చౌకోడి, అల్మోరాలో ఒక రాత్రి బస చేసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రతి బృందం 22 రోజుల పాటు ప్రయాణిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

