Single Dose Covid Vaccine | సింగిల్ డోస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ప్రభుత్వ అనుమతి కోరిన జాన్సన్ అండ్ జాన్సన్
Single Dose Covid Vaccine | కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ ( Single Dose Covid Vaccine ) అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ జాన్సెన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ సంస్థ ఇండియాలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండా నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీంతో పాత దరఖాస్తును ఉపసంహరించుకున్న జే అండ్ జే సంస్థ.. తాజాగా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. గురువారమే అప్లై చేసుకున్నట్లు ఆ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఇండియా ప్రజలకు తమ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ. లిమిటెడ్ సంస్థతో జే అండ్ జే చేతులు కలిపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నాకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

