కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు : జితిన్ ప్రసాద

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై క్రమంగా కనుమరుగవుతోందని ఆ పార్టీని వీడిన కీలక యూపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. కాషాయ పార్టీలో చేరిన జితన్ ప్రసాద దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పాటుపడుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్షీణస్థితికి చేరుతోందని రెండు సార్లు ఎంపీగా వ్యవహరించిన జితిన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందనే ఆశ తనలో లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరాలని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
జితిన్ ప్రసాద బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ముఖ్య ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో జితేంద్ర ప్రసాద వారికి రాజకీయ సలహాదారుగా ఉన్నారు.
ఇక జితిన్ ప్రసాద మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరొందిన జితిన్ ప్రసాద నిష్క్రమణతో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

