JEE Main Result | జేఈఈ-మెయిన్ ఫలితాలు జాప్యం.. సీబీఐ దర్యాప్తు.. ఎన్టీఏ ఆప్షన్లేంటి?!
JEE Main Result | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్ అడ్మిషన్ల కోసం జరిగే జేఈఈ-మెయిన్ పరీక్ష భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిం....

JEE Main Result | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్ అడ్మిషన్ల కోసం జరిగే జేఈఈ-మెయిన్ పరీక్ష భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో జేఈఈ-మెయిన్ పరీక్ష అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో జేఈఈ-మెయిన్ పరీక్ష ఫలితాల వెల్లడి జాప్యం అవుతుందా.. దీని నిర్వాహక సంస్థ జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటన్నదానిపై గందరగోళం నెలకొంది.
హర్యానాలోని ఓ కేంద్రంలో అవకతవకలు
హర్యానాలోని సోనేపట్ పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగాయని సీబీఐ ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఇది ఒక పరీక్షా కేంద్రానికే పరిమితమా.. ఇతర పరీక్షా కేంద్రాలకూ సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది.
నిందితులెవ్వరో నిగ్గు తేల్చే పనిలో సీబీఐ
లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశించే ఈ జేఈఈ-మెయిన్ పరీక్ష కుంభకోణంలో అసలు నిందితులు ఎవరన్న విషయమై నిగ్గు తేల్చే విషయమై సీబీఐ మల్లగుల్లాలు పడుతోంది.
ఒకవేళ మొత్తం పరీక్షనే రద్దు చేస్తే అవకతవకలు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. లక్షల మంది విద్యార్థులపై దీని ప్రభావం ప్రతికూలంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.
జేఈఈ-మెయిన్ భవితవ్యంపై ఎన్టీఏదే తుది నిర్ణయం
ఈ పరీక్షను రద్దు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్టీఏకే ఉంటుందని సమాచారం. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఇంతకుముందు సముపార్జించిన అధిక స్కోర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ఇప్పటివరకు నాలుగు దఫాలు జేఈఈ-మెయిన్ రాశారు. ఇందులో నాలుగో విడత పరీక్షను రద్దు చేసి, మిగతా పరీక్షల ఆధారంగా ఫలితాలను వెల్లడించడానికి అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఈ నెల 2న సీబీఐ సోదాలు
ఈ నెల రెండో తేదీన సీబీఐ.. ఈ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్పూర్లలో దాడులు జరిపింది.
ఎఫినిటి ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డైరెక్టర్లు సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేయ్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ, అందులో పని చేస్తున్న సిబ్బంది జేఈఈ-మెయిన్‌లో పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎన్ఐటీలో అడ్మిషన్ పొందాలని కోరుకుంటున్న విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ముడుపులను ఎఫినిటీ ఎడ్యుకేషన్ సంస్థ ఉద్యోగులు అందుకున్నట్లు అభియోగం.
హర్యానాలోని సోనేపట్ వద్ద పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థి.. రిమోట్ యాక్సెస్ ద్వారా జవాబులు తెలిసేలా చేశారని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cbi
- investigation
- jee-main
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

