Pulwama | దక్షిణ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం..
Pulwama | దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.
Pulwama | దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది. స్థానికంగా ఉగ్రవాది దాక్కున్నారనే సమాచారం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బలగాలను చూసిన ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరుపడంతో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సదరు ఉగ్రవాది గుర్తింపు తెలియరాలేదని.. వివరాలు ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పోలీసులు, భద్రతా బలగాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఉగ్రవాదుల మాడ్యూల్స్‌ను భద్రతా బలగాలు ఛేదించాయి. తీవ్రవాదులకు సహకారం అందిస్తున్న ముగ్గురిని ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులు లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాదులకు సహకారం అందిస్తున్నట్లుగా తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

