2011 జనాభా లెక్కల ప్రకారమే కశ్మీర్లో డీలిమిటేషన్..

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 24 సీట్లు ఖాళీగా ఉంటాయని, వాటిని పునర్ విభజనలో కలపబోమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూలో 53,78,538 మంది, కశ్మీర్లో 68,88,475 మంది ఉన్నారు.
కశ్మీర్లో 1981లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారని, 14 ఏళ్ల తర్వాత ఆ కమిషన్ 1995లో నివేదిక సమర్పించిందని, ప్రస్తుతం 1981 సెన్సెస్ ప్రకారమే అక్కడ నియోజవకర్గాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్లో నియోజకవర్గాల పునర్ విభజన జరగలేదన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోనున్నట్లు సీఈసీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
అన్ని రంగాల నుంచి వస్తున్న డిమాండ్లు, ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని, ఓ ముసాయిదాను తయారు చేసి ప్రజల ముందు ఉంచుతామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో కొత్త ఏడు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

