jamili elections | జమిలి ఎన్నికల బిల్లు ఏం చెప్తున్నది.. అందులో ఏయే అంశాలు కీలకంగా ఉన్నాయి!
jamili elections | లోక్‌సభలో మంగళవారం జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల్లో మొదటిది లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించినది.
jamili elections | హైదరాబాద్, డిసెంబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): లోక్‌సభలో మంగళవారం జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల్లో మొదటిది లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించినది.
బిల్లులో ఏ ఆర్టికల్ ఏం చెప్తున్నది?
ఏకకాల ఎన్నికల నిర్వహణకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2024లో రాజ్యాంగంలోని మూడు ఆర్టికల్స్‌ను సవరించడంతో పాటు కొత్తగా ఆర్టికల్ 82ఏను చేర్చాలని కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది.
ఆర్టికల్ 82ఏలో తీసుకొచ్చే ఆరు క్లాజులు
ఆర్టికల్ 82ఏ(1): జమిలి బిల్లు ఆమోదం పొందిన తర్వాత సాధారణ ఎన్నికలు జరిగిన పిదప కొలువుదీరే తొలి లోక్‌సభలో రాష్ట్రపతి ఈ క్లాజును నోటిఫై చేయాలి. ఆ రోజునే అపాయింటెడ్ డేగా పరిగణించాలి.
ఆర్టికల్ 82ఏ(2): అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడిన అన్ని రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితి ఆ లోక్‌సభ కాల పరిమితితోనే ముగుస్తుంది. అంటే అవసరమైతే, అసెంబ్లీల కాలపరిమితిలో కుదింపు జరుగొచ్చు. అలాగే, లోక్‌సభ కంటే ముందు ఏర్పడిన అసెంబ్లీల కాలపరిమితి లోక్‌సభ కాలపరిమితికి అనుగుణంగా పొడిగింపు కూడా ఉంటుంది.
ఆర్టికల్ 82ఏ(3): లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికల సంఘం (ఈసీ) ఎలక్షన్స్‌ను నిర్వహిస్తుంది.
ఆర్టికల్ 82ఏ(4): ఈ క్లాజు జమిలి ఎన్నికలను నిర్వచిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు నిర్వహించడమే దీని లక్ష్యం.
ఆర్టికల్ 82ఏ(5): కొన్ని అనివార్య పరిస్థితులు తలెత్తినప్పుడు లోక్‌సభతో పాటు ఏదైనా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించలేని వెసులుబాటు ఈసీ కలిగి ఉంది.
ఆర్టికల్ 82ఏ(6): లోక్‌సభతో కాకుండా కొంత జాప్యంతో ఎన్నికలు జరిగిన అసెంబ్లీ కాలపరిమితి ఆ లోక్‌సభతోనే ముగిసిపోతుంది.
సవరణ చేయబోతున్న ఆర్టికల్స్
ఆర్టికల్ 83: ఈ ఆర్టికల్‌లో మళ్లీ ఐదు క్లాజులు ఉన్నాయి. లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఐదేండ్ల కాలపరిమితి ఉంటుందని తొలి క్లాజు పేర్కొంటున్నది. ఐదేండ్ల కాలపరిమితితో కొలువుదీరే లోక్‌సభ మధ్యలో రైద్దెతే మిగిలిన కాలాన్ని వీగిపోని కాలంగా (అన్ఎక్పైర్డ్ టర్మ్) పరిగణించాలని రెండో క్లాజు చెప్తుంది. లోక్‌సభ రైద్దెన తర్వాత మిడ్‌టర్మ్ ఎన్నికలతో కొత్త లోక్‌సభ కొలువుదీరుతుందని మూడో క్లాజు తెలియజేస్తుంది. అలా ఏర్పడిన కొత్త లోక్‌సభ మిగిలిన కాలానికి మాత్రమే (ఐదేండ్ల కంటే తక్కువ) ఉంటుందని నాలుగో క్లాజు చెప్తుంది. మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ ద్వారా కొలువుదీరిన లోక్‌సభ.. అంతకు ముందు రైద్దెన లోక్‌సభ కాలంతో కలిపి మొత్తంగా ఐదు ఏండ్లు పూర్తికాగానే మళ్లీ సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఐదో క్లాజు చెప్తున్నది.
ఆర్టికల్ 172: ఆర్టికల్ 83లోని ఐదు క్లాజులు ఎలాగైతే లోక్‌సభ కాలపరిమితికి సంబంధించిన నిబంధనలను వెల్లడించాయో.. ఆర్టికల్ 172 క్లాజులు అసెంబ్లీలకు అలాగే వర్తిస్తాయి. అసెంబ్లీల కాలవ్యవధి అనేది లోక్‌సభకు అనుగుణంగానే ఉంటుంది.
ఆర్టికల్ 327: రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలు (ఎలక్టోరల్ రోల్, నియోజకవర్గాల పునర్విభజన వగైరా) పార్లమెంట్ నిర్ణయిస్తుందని ఈ ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

