మసీదుల్లో మైకులకు అనుమతి తీసుకోండి.. కోరిన జమియత్ ఐ హింద్
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
ముంబై: మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది. ప్రార్థనా స్థలాల్లో మైకుల ఏర్పాటుపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో జమియత్ రాష్ట్ర శాఖ కార్యదర్శి గుల్జార్ అహ్మద్ ఈ మేరకు మసీదుల నిర్వాహకులకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో పోలీసు శాఖ అనుమతి తీసుకునే మైకులను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ తీసుకోని వారు తక్షణమే పోలీసుల అనుమతి కోరాలని కోరుతున్నానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల హక్కులను కాపాడేలా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
మసీదుల్లో మైకులు వాడకంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. మే 3 నాటికి రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాని మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అలా చేయనట్లయితే మసీదుల వద్ద తమ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తారని, వాటిలో హనుమాన్ చాలీసా వినిపిస్తారని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

