భారత్-చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం పట్టివేత
భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) అధికారులు సీజ్ చేశారు.
లెహ్, జూలై 10: భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) అధికారులు సీజ్ చేశారు. మంగళవారం తూర్పు లఢక్‌లో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక్కోటి కిలో బరువున్న 108 బంగారు కడ్డీలు పట్టుబడినట్టు ఐటీబీపీ అధికారి ఒకరు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
13 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన బైపోల్స్
న్యూఢిల్లీ: ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల చెదురుమదురు హింసాత్మక ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ తెలిపింది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో అత్యధికంగా 82.48 శాతం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ స్థానంలో అత్యల్పంగా 49.80 శాతం ఓటింగ్ నమోదైంది.
పాల వ్యానును ఢీకొట్టిన బస్సు.. 18 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. బెహతా ముఝావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోజికోట్ గ్రామం సమీపంలో ఓ పాల వ్యానును డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడినట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్బీ షిరద్కర్ చెప్పారు.
పెగాసస్‌తో నా ఫోన్ హ్యాక్ చేశారు: ముఫ్తీ కుమార్తె
శ్రీనగర్: పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ బుధవారం సంచలన ఆరోపణ చేశారు. తన ఫోన్‌ను పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేశారని చెప్పారు. దీని గురించి తనకు యాపిల్ అలర్ట్ వచ్చిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం కేంద్రం పెగాసస్‌ను సేకరించిందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

