చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
- కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు. లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా సున్నితంగా, ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల సైనిక బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయన్నారు. శనివారం ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే సరిహద్దు ప్రతిష్టంభనను చైనాయే పరిష్కరించాల్సి ఉన్నదన్నారు. 2020 సెప్టెంబర్‌లో సూత్రపాయంగా కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉన్నదని, ఆ ఒప్పందంలో అంగీకరించిన అంశాలను చైనా అమలు చేయాల్సి ఉన్నదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

