ఈ ఎన్కౌంటర్ ‘డీఎన్ఎల్ఏ’కు పెద్ద ఎదురు దెబ్బ : సీఎం హిమంత బిశ్వ శర్మ
‘డీఎన్ఎల్ఏ’కు పెద్ద ఎదురు దెబ్బ | అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు.

అస్సాం : అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు. సంస్థకు చెందిన ఇద్దరు అగ్ర లీడర్లు సైతం ఎన్కౌంటర్లో గాయపడినట్లు ఆయన తెలిపారు. ఎన్కౌంటర్పై ఆదివారం మధ్యాహ్నం మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలోనే చనిపోయారని, ఘటనాస్థలంలో 3 ఏకే- 47లు, భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.
అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాల సరిహద్దులో ఆ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ సోనోవాల్ ఆధ్వర్యంలో తిరుబాటుదారుల ఏరివేతకు భద్రతాదళాలు శనివారం రాత్రి ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో ఏడుగురు తిరుగుబాటుదారులను ఎన్కౌంటర్లో హతమార్చారు. అస్సాం పోలీసులు, అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. అస్సాంలోని డిమా హసావో, కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలతోపాటు నాగాలాండ్ సరిహద్దు జిల్లాల్లో డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

