Aditya L1 | ఇస్రో మరో చరిత్ర.. విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్-1
Aditya L1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది.
Aditya L1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.
ఇక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాగ్రాంజ్ పాయింట్ భూమి-సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో మిషన్‌ను చేపట్టింది. విజయవంతంగా ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- aditya l1
- India
- ISRO
- Sun Mission
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

