టెహ్రాన్ : అమెరికాతో చర్చల్లో యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అరేబియా సముద్రంలో అమెరికా మోహరింపులకు తాము భయపడేది లేదని స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చీ ఎఫ్ఎఫ్పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధం వచ్చినా యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని మేం ఎందుకు నొక్కి చెబుతున్నాం?
ఎందుకంటే తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదు’ అని ఆయన స్పష్టంచేశారు. అరేబియా సముద్రంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకను అమెరికా మోహరించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది తమను భయపెట్టలేదని స్పష్టంచేశారు.