అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఫొటోలు
యోగా దినోత్సవం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని టైమ్స్ స్వ్కేర్‌లో జరిగిన కార్యక్రమంలో మూడు వేలమందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లఢక్‌లోని పాంగాంగ్ టీఎస్ఓ సరస్సు వద్ద ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ)లు యోగాసనాలు వేశారు.
అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తోథిపూర్లో ఉన్న యానిమల్ ట్రైనింగ్ స్కూల్ (ఏటీఎస్)లో గుర్రాలపై ఐటీబీపీ సైనికులు ఆసనాలు వేశారు. ఇక లఢక్‌లోని 18 వేల అడుగుల ఎత్తయిన పర్వత శ్రేణిపై ఐటీబీపీ సైనికులు యోగా కార్యక్రమం నిర్వహించారు. గల్వాన్‌లో, లఢక్‌లో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద సైనికులు యోగా సాధన చేశారు. హరిద్వార్‌లోని నిరమాయం యోగ్గ్రామ్లో యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ యోగాసనాలు వేశారు.










Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

