Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
Chattishgarh | ఛత్తీస్‌గఢ్‌లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
Chattishgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

